V Krishna Mohan: 'మా' ఎన్నికల సీసీ కెమెరా ఫుటేజి కావాలంటే కోర్టుకు వెళ్లండి: ఎన్నికల అధికారి కృష్ణమోహన్

MAA Election Officer Krishna Mohan opines on latest developments
  • 'మా' ఎన్నికలు వివాదాస్పదం
  • అక్రమాలు జరిగాయంటున్న ప్రకాశ్ రాజ్
  • కీలకంగా మారిన సీసీ కెమెరా ఫుటేజి
  • కోర్టు ఏం చెబితే అది పాటిస్తానన్న ఎన్నికల అధికారి
'మా' ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, తమ వర్గీయులపై దాడి జరిగిందని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్న నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజి కీలకంగా మారింది. దీనిపై 'మా' ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ స్పందించారు. సీసీ కెమెరా ఫుటేజి కావాలంటే కోర్టుకు వెళ్లాలని సూచించారు. కోర్టు తీర్పును తాను పాటిస్తానని స్పష్టం చేశారు. 'మా' ఎన్నికలు సజావుగా నిర్వహించడం వరకే తన బాధ్యత అని, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఏం జరిగిందనేది తనకు సంబంధంలేని విషయం అని వివరించారు. 'మా' ఎన్నికలకు సంబంధించి తన విధి నిర్వహణ పూర్తయిందని పేర్కొన్నారు.
V Krishna Mohan
MAA Election Officer
CCTV Footage
Prakash Raj
Tollywood

More Telugu News