టీ20 వరల్డ్ కప్: ఐర్లాండ్ తో నెదర్లాండ్స్ ఢీ

18-10-2021 Mon 15:33
  • టీ20 వరల్డ్ కప్ తొలి దశ పోటీలు
  • అబుదాబి వేదికగా మ్యాచ్
  • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
  • ఇరుజట్లలోనూ కౌంటీ అనుభవం ఉన్న ఆటగాళ్లు
Ireland and Nederlands fights in ICC World Cup
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తొలి దశ పోటీల్లో భాగంగా ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20 ర్యాంకింగ్స్ లో ఐర్లాండ్ 12వ స్థానంలో ఉండగా, నెదర్లాండ్స్ 17వ స్థానంలో ఉంది.

ఇరు జట్లలోనూ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడే అనేకమంది ఆటగాళ్లు ఉండడంతో, ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహంలేదు. నెదర్లాండ్స్ జట్టులో రైలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ర్యాన్ టెన్ డెష్కాటే... ఐర్లాండ్ జట్టులో పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఓబ్రియాన్, కెప్టెన్ ఆండ్రూ బాల్ బిర్నీ గమనించదగ్గ ఆటగాళ్లు.