రేపు యాదాద్రికి కేసీఆర్.. కీలక ప్రకటన చేయనున్న సీఎం!

18-10-2021 Mon 14:14
  • రేపు ఉదయం 11.30 గంటలకు యాదాద్రికి బయల్దేరనున్న కేసీఆర్
  • యాదాద్రి ఆలయం పునఃప్రారంభ తేదీలను ప్రకటించనున్న సీఎం
  • ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన చినజీయర్ స్వామి
KCR to announce Yadadri temple reopening date
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన హైదరాబాదులోని ప్రగతి భవన్ నుంచి యాదాద్రికి బయల్దేరనున్నారు. తన పర్యటన సందర్భంగా యాదాద్రి నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తారు.

ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం పునఃప్రారంభ తేదీలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ఆలయ పునఃప్రారంభ తేదీ ముహూర్తాన్ని చినజీయర్ స్వామి ఇప్పటికే నిర్ణయించారు. చినజీయర్ స్వామి నిర్ణయించిన తేదీలను కేసీఆర్ రేపు అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో పాటు మహా సుదర్శన యాగం వివరాలను కూడా ప్రకటించబోతున్నారు.