SI: అత్తారింటికి పండుగకు వచ్చి.. బైక్ లకు జరిమానాలు వేసిన ఎస్సై అల్లుడు.. స్థానికుల ఆగ్రహం!

  • తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో ఘటన
  • రెండు బైక్ లకు భారీ ఫైన్ విధించిన ఎస్సై
  • మీ పీఎస్ పరిధిలో లేకపోయినా ఫైన్ ఎలా విధిస్తారని గ్రామస్థుల మండిపాటు
People fires on SI for his misconduct

పండక్కి అత్తగారింటికి వెళ్లిన ఎస్సై... గ్రామంలో ఉన్న బైక్ లకు ఫైన్ విధించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రావాడ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే బిక్కవోలు ఎస్సై శ్రీనివాస్ పండక్కి పండ్రావాడ గ్రామంలోని అత్తగారింటికి వచ్చారు. పండక్కి వచ్చిన ఆయన అత్తగారింట్లో హాయిగా ఉండక... గ్రామంలో ఉన్న బైకులకు ఫైన్ లు వేశారు. ఆన్ లైన్ ద్వారా రెండు బైక్ లకు చలానా విధించారు. ఆ ఫైన్ లు కూడా భారీగా ఉన్నాయి. ఒక బైక్ కు రూ. 10,070... మరో బైక్ కు రూ. 5,035 ఫైన్ వేశారు.

దీంతో గ్రామస్థులు ఎస్సైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోలీస్ స్టేషన్ పరిధిలో లేనప్పటికీ ఫైన్ వేయడంపై మండిపడ్డారు. ఆయన అత్తగారింటికి వెళ్లి గొడవపడ్డారు. వారిపై ఎస్సై కూడా సీరియస్ అయ్యారు. దౌర్జన్యం చేశారంటూ కేసులు బుక్ చేస్తానని హెచ్చరించారు. దీంతో, జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామంటూ ఎస్సైకి గ్రామస్థులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

More Telugu News