Dera Baba: కాసేపట్లో డేరా బాబాకు శిక్ష ఖరారు.. మరణశిక్ష విధించాలని కోరిన సీబీఐ!

  • 2002లో డేరాబాబా మేనేజర్ హత్య
  • డేరాబాబాతో పాటు మరో నలుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు
  • క్షమాభిక్ష కోరిన డేరాబాబా
Gurmeet Ram Rahim Singh sentencing in murder case today

డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా భవితవ్యం కాసేపట్లో తేలిపోనుంది. తన డేరాలో మేనేజర్ గా పని చేస్తున్న రంజిత్ సింగ్ ను 2002లో హత్య చేశాడంటూ అక్టోబర్ 8న పంచకులలోని సీబీఐ స్పెషల్ కోర్టు డేరాబాబాను దోషిగా తేల్చింది. ఆయనకు విధించబోయే శిక్షను కోర్టు ఈరోజు వెలువరించనుంది. ఈ హత్య కేసులో డేరాబాబాతో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరోవైపు వాదనల సందర్భంగా డేరాబాబాకు మరణశిక్ష విధించాలని కోర్టును సీబీఐ కోరింది.

ఈరోజు డేరాబాబాకు శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో హర్యానాలోని పంచకుల జిల్లాలో గట్టి భద్రతా ఏర్పాట్లను చేసినట్టు డీసీపీ మోహిత్ హండా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 విధించినట్టు చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. డేరాబాబా ప్రస్తుతం రోహ్ తక్ జైల్లో ఉన్నారు. జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కోర్టును క్షమాభిక్షను కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు డేరాబాబాకు ఎలాంటి శిక్షను విధించబోతోందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

More Telugu News