అక్కడ అఘోరాగా .. ఇక్కడ స్వామీజీగా బాలకృష్ణ?

18-10-2021 Mon 11:05
  • షూటింగు పూర్తి చేసుకున్న 'అఖండ'
  • చురుకుగా జరుగుతున్న మిగతా పనులు
  • నవంబర్ 4వ తేదీన విడుదల
  • త్వరలోనే  గోపీచంద్ మలినేనితో సెట్స్ పైకి
Balakushna and Gopichand Malineni movie update
బాలకృష్ణ తాజా చిత్రంగా 'అఖండ' రూపొందింది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో రైతుగా కనిపించనున్న ఆయన, మరో పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. ఈ రెండు పాత్రల మధ్య గల సంబంధం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు.

ఒక పాత్రలో ఆయన స్వామీజీగా కనిపించనున్నారని అంటున్నారు. రాయలసీమ .. కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా స్వామిజీ లుక్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తాయని అంటున్నారు. తెరపై ఈ పాత్ర కనిపించేది కొంతసేపే అయినా అది చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.