Kesineni Nani: తన కార్యాలయంలో చంద్రబాబు ఫొటోను తొలగించిన కేశినేని నాని

Kesineni Nani removes photo of Chandrababu in his office
  • ఇతర ముఖ్య నేతల ఫొటోలు కూడా తొలగింపు
  • రతన్ టాటాతో కలిసున్న ఫొటోను ఏర్పాటు చేసిన వైనం
  • పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం

ఇటీవలి కాలంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఆయన పార్టీ నాయకత్వంపై అలకబూనారు. అయితే పార్టీ అధినేత, ఇతర కీలక నేతలు సముదాయించడంతో ఆయన కాస్త మెత్తబడ్డారు. దీంతో, సమస్య సమసిపోయిందని అందరూ అనుకున్నారు. తాజాగా ఆయన వ్యవహారశైలి మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడ కేశినేని భవన్ లోని ఆయన పార్లమెంటు కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించారు. ఆయనతో పాటు పార్టీలోని మరికొందరు ముఖ్యనేతల ఫొటోలను కూడా పక్కనపెట్టారు. చంద్రబాబు ఫొటో స్థానంలో... రతన్ టాటాతో తాను కలిసున్న ఫొటోను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని టీడీపీ నుంచి వైదొలగేందుకు సిద్ధపడే ఈ పని చేశారని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెపితే ఏ పార్టీలో చేరబోతారనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News