Manchu Vishnu: వారి రాజీనామా విషయం మీడియా ద్వారానే తెలిసింది: మంచు విష్ణు

MAA president Manchu Vishnu responds about Prakash Raj Panel resignations
  • తండ్రి, ప్యానెల్ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న విష్ణు
  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదన్న మా అధ్యక్షుడు
  • విజయం కోసం తమ ప్యానెల్ ఎంతగానో కష్టపడిందన్న విష్ణు
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విజయం సాధించిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామా చేసిన విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తండ్రి మోహన్‌బాబు, ప్యానెల్ సభ్యులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విష్ణు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

 ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా లేఖలు తమకు ఇంకా అందలేదని తెలిపారు. అవి అందిన తర్వాతే వాటిపై స్పందిస్తానన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో విజయం కోసం తన ప్యానెల్ ఎంతో కష్టపడిందని, స్వామివారి ఆశీస్సుల కోసమే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. అసోయేషన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని విష్ణు పేర్కొన్నారు.
Manchu Vishnu
MAA
Tirupati
Tirumala
Prakash Raj
Mohan Babu

More Telugu News