Surat: సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ప్యాకేజింగ్ కంపెనీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Two persons dead and 125 people rescued after a fire broke out in Surat
  • ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం పైనుంచి దూకేసిన కార్మికులు
  • ఇద్దరు కార్మికుల మృతి
  • ఇప్పటి వరకు 125 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది
గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన సూరత్‌లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కడోదరలోని వారేలిలోని ఓ ప్యాకేజింగ్ యూనిట్‌లోని ఐదో అంతస్తులో కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారి చుట్టుముట్టడంతో భయపడిన కార్మికులు కొందరు ప్రాణాలు దక్కించుకునేందుకు భవనంపై నుంచి దూకేశారు.

 ఈ క్రమంలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 125 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వీరిలో దాదాపు వందమందిని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో వందమందికిపైగా భవనంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Surat
Gujarat
Fire
Packaging Factory
Vareli
Kadodara

More Telugu News