సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ప్యాకేజింగ్ కంపెనీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం పైనుంచి దూకేసిన కార్మికులు
- ఇద్దరు కార్మికుల మృతి
- ఇప్పటి వరకు 125 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది
ఈ క్రమంలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 125 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వీరిలో దాదాపు వందమందిని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో వందమందికిపైగా భవనంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.