ఉత్తరాఖండ్ కు ఐఎండీ రెడ్ అలర్ట్... బద్రీనాథ్ యాత్ర నిలిపివేత

17-10-2021 Sun 17:58
  • రాబోయే మూడ్రోజుల్లో అతి భారీ వర్షాలు
  • అప్రమత్తమైన ప్రభుత్వం
  • అధికారులు సన్నద్ధంగా ఉండాలన్న సీఎం
  • యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్న చమోలీ కలెక్టర్
Badrinath pilgrimage halted after IMD issues red alert for Uttarakhand
ఉత్తరాఖండ్ లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం పుష్పర్ సింగ్ ధామీ ఆదేశించారు. ఈ క్రమంలో చమోలీ జిల్లా అధికారులు నేటి బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు. యాత్రికులు అందరూ జోషి మఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.