టీ20 వరల్డ్ కప్: పాపువా న్యూగినియా స్కోరు 129-9

17-10-2021 Sun 17:20
  • టీ20 వరల్డ్ కప్ ప్రారంభం
  • తొలి మ్యాచ్ లో ఒమన్ తో పాపువా న్యూగినియా ఢీ
  • మొదట బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా
  • రాణించిన అసద్ వాలా, చార్లెస్ అమిని
Papua New Guinea concludes innings against Oman
టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో ఒమన్, పాపువా న్యూగినియా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు చేసింది. సున్నా పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకున్న పాపువా జట్టును కెప్టెన్ అసద్ వాలా, చార్లెస్ అమిని ఆదుకున్నారు.

అసద్ వాలా 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. అమిని 26 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. సెసా బావు 13 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు తప్ప పాపువా జట్టులో మరే బ్యాట్స్ మన్ రెండంకెల స్కోరు సాధించలేదు. ఒమన్ బౌలర్లలో కెప్టెన్ జీషన్ మక్సూద్ 4 వికెట్లు తీయగా, బిలాల్ ఖాన్ 2, కలీముల్లా 2 వికెట్లు పడగొట్టారు.