ఒమన్ జట్టులో హైదరాబాద్ క్రికెటర్.. ఉద్యోగం కోసం వెళ్లి జట్టులో స్థానం!

17-10-2021 Sun 07:29
  • ఒమన్ జట్టులో సందీప్ గౌడ్
  • హైదరాబాద్ అండర్-15, 19 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం
  • 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లి అక్కడే స్థిరపడిన సందీప్
  • అక్కడి దేశవాళీ పోటీల్లో అదరగొట్టి జాతీయ జట్టులో స్థానం
Hyderabads Sandeep goud represents Oman Cricket Team
ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచుల్లో తడిసి ముద్దయిన అభిమానులకు నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ బోల్డంత వినోదాన్ని అందించబోతోంది. నేడు ఒమన్-పపువా న్యూ గినియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు అందరి కళ్లు, మరీ ముఖ్యంగా హైదరాబాదీల కళ్లన్నీ ఈ మ్యాచ్‌పైనే ఉన్నాయి. కారణం.. ఒమన్ జట్టుకు హైదరాబాద్ కుర్రాడు ప్రాతినిధ్యం వహిస్తుండడమే.

నగరంలోని కవాడీగూడకు చెందిన శ్రీమంతుల సందీప్ గౌడ్ (29) ఒమన్ జట్టుకు ఆడుతున్నాడు. 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లిన సందీప్ అక్కడే స్థిరపడ్డాడు. అక్కడి దేశవాళీ మ్యాచుల్లో ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. అలా అతడికి జాతీయ జట్టులో చోటు లభించింది. సందీప్ 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.