Britain: ఎంపీని హత్య చేసిన చర్చ్ కు వెళ్లిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Boris Johnson Visits Church Where MP Stabbed To Death
  • చర్చిలో ఎంపీ డేవిడ్ అమీస్ పై కత్తితో దాడి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎంపీ మృతి
  • ఇస్లామిక్ ఉగ్రవాదులే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసుల అనుమానం
చర్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బ్రిటన్ ఎంపీ ఒకరు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దుండగుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత, ఎంపీ అయిన డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా దాడి చేసిన ఓ వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన ఎంపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఈ దుర్ఘటన జరిగిన చర్చికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెళ్లారు. ఎంపీని పొడిచిన స్థలంలో పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 25 ఏళ్ల బ్రిటీష్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Britain
MP
Murder
Boris Johnson

More Telugu News