MS Dhoni: ఇండియాకు ధోనీ వచ్చిన తర్వాతే సెలబ్రేషన్లు జరుపుకుంటాం: సీఎస్కే సీఈఓ

Will Celebrate IPL Victory After Dhoni Returns To India says CSK CEO
  • ఐపీఎల్ టోర్నీని కైవసం చేసుకున్న సీఎస్కే
  • టీ20 ప్రపంచకప్ కోసం యూఏఈలోనే ఉన్న ధోనీ
  • ధోనీ లేకుండా సెలబ్రేషన్స్ చేసుకోబోమన్న సీఈవో
ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న కేకేఆర్ తో జరిగిన ఫైనల్ లో సీఎస్కే 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సీఎస్కే అభిమానులు, మేనేజ్ మెంట్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఈ సందర్భంగా సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ ధోనీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాతే సెలబ్రేషన్స్ జరుపుకుంటామని చెప్పారు. కెప్టెన్ లేకుండా వేడుకలు జరుపుకోబోమని స్పష్టం చేశారు. కెప్టెన్ ధోనీ ఇండియాకు వచ్చేంత వరకు వేచి చూస్తామని చెప్పారు. టీ20 ప్రపంచకప్ తర్వాత ధోనీ వస్తాడని తెలిపారు. ఇప్పటికే ఆయన సీఎస్కే కెప్టెన్ నుంచి టీమిండియా మెంటార్ గా మారిపోయారని చెప్పారు. టీ20 ప్రపంచకప్ తర్వాతే సీఎస్కే వేడుకలు ఉంటాయని తెలిపారు.
MS Dhoni
IPL
CSK
CEO
Celebrations

More Telugu News