బన్నీ కెరియర్లోనే రికార్డు స్థాయిలో 'పుష్ప'ను రిలీజ్ చేస్తారట!

16-10-2021 Sat 10:29
  • ఐదు భాషల్లో 'పుష్ప' విడుదల
  • డిసెంబర్ 17వ తేదీన థియేటర్లకు
  • ఓవర్సీస్ మార్కెట్ లోను దూకుడు
  • డిసెంబర్ 16 నుంచి ప్రీమియర్ షోలు  
Pushpa movie update
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందిస్తున్నాడు. అడవిలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించనుండగా, గిరిజన గూడెంకు చెందిన శ్రీవల్లి పాత్రలో రష్మిక సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని ఐదు భాషల్లో డిసెంబర్ 17వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. హంసిని ఎంటర్టైన్మెంట్స్ - క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను, యూఎస్ లో ఐదు భాషల్లోను రికార్డు స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. డిసెంబర్ 16 నుంచి ప్రీమియర్లతో అక్కడ సందడి మొదలవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లోను .. ఓవర్సీస్ లో ఈ స్థాయిలో విడుదలవుతున్న బన్నీ మొదటి సినిమా ఇదేనని అంటున్నారు. అలాగే కరోనా తరువాత దక్షిణాది నుంచి భారీ స్థాయిలో విడుదలవుతున్న సినిమా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ సినిమాతో బన్నీ ఖాతాలో మరో రికార్డు నమోదు కావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.