సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

16-10-2021 Sat 07:29
  • ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ 
  • రామ్ చరణ్ తో 'సలార్' దర్శకుడు
  • మెగాస్టార్ చిత్రానికి మణిశర్మ తనయుడు  
Samantha to do a bilingual movie
*  ప్రస్తుతం కథానాయిక సమంత కొత్త ప్రాజక్టులను ఓకే చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఓ ద్విభాషా చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. నూతన తమిళ దర్శకుడు శాంతారూబేన్ జ్ఞానశేఖరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
*  ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' చిత్రాన్ని రూపొందిస్తున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో రామ్ చరణ్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయంపై ప్రశాంత్ తాజాగా హింట్ ఇచ్చాడు. నిన్న రామ్ చరణ్ ను, చిరంజీవిని కలిసినట్టు ప్రశాంత్ పేర్కొన్నాడు. ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి రూపొందించే చిత్రం తర్వాత సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.
*  ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ లక్కీ ఛాన్స్ కొట్టాడు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటించే 'భోళాశంకర్' చిత్రానికి సంగీతాన్ని సమకూర్చే అవకాశం మహతి స్వర సాగర్ కి లభించింది. ఇది అతని కెరీర్ కి పెద్ద బ్రేక్ అవుతుందని భావించవచ్చు.