Raviteja: రవితేజ న్యూ మూవీ టైటిల్ 'ధమాకా'

Raviteja new movie title confirmed
  • విడుదలకి రెడీగా 'ఖిలాడి'
  • షూటింగు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
  • నక్కిన త్రినాథరావుకి గ్రీన్ సిగ్నల్
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్

రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖిలాడి' సినిమా సిద్ధమవుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఆ తరువాత సినిమాగా ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను కూడా కానిచ్చేస్తూనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే నక్కిన త్రినాథరావుకి కూడా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ఒక వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాకి 'ధమాకా' అనే టైటిల్ ను సెట్ చేసి, విజయదశమి సందర్భంగా కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను వదిలారు. 'డబుల్ ఇంపాక్ట్' అనే ట్యాగ్ తో ఈ సినిమాలో ఆయన డ్యూయెల్ రోల్ చేయనున్నాడనే హింట్ ఇచ్చారు.

విశ్వప్రసాద్ .. అభిషేక్ అగర్వాల్ .. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భీమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ కంటెంట్ తోనే త్రినాథరావు దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి ఆయనకి రవితేజ తోడైతే తెరపై ఎలా ఉంటుందనేది ఊహించుకోవచ్చు.

  • Loading...

More Telugu News