Srisailam: శ్రీశైలానికి భారీ వరద... గేట్లను ఎత్తేసిన అధికారులు!

Srisailam gates lifted for 10 meters
  • ఎగువ నుంచి కొనసాగుతున్న వరద
  • 884.90 అడుగులకు చేరిన నీటిమట్టం
  • గేట్లను 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్ కు 1,30,112 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... ఔట్ ఫ్లో 97,748 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884.90 అడుగుల నీటిమట్టం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయి నీటి నిలువ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో... అధికారులు గేట్లను ఎత్తేశారు. 10 అడుగుల మేర గేట్లు ఎత్తారు. ఈ సీజన్ లో రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తడం ఇది ఐదో సారి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
Srisailam
Flood Water
Water Level
Gates

More Telugu News