తమిళంలో 'అన్నాత్తే' .. తెలుగులో 'పెద్దన్న'

15-10-2021 Fri 10:42
  • రజనీ నుంచి మరో విభిన్న కథా చిత్రం 
  • సన్ పిక్చర్స్ వారి భారీ నిర్మాణం
  • ఆసక్తిని పెంచుతున్న భారీ తారాగణం  
  • తెలుగు .. తమిళ భాషల్లో ఒకే రోజున రిలీజ్  
Annatthe movie update
రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' రూపొందింది. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను, సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'అన్నయ్య' అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తెలుగు టైటిల్ గా 'పెద్దన్న'ను ఖాయం చేశారు.

'విజయదశమి' సందర్భాన్ని పురస్కరించుకుని, శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పెద్దన్న' టైటిల్ తప్పకుండా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే 'పెద్దన్న'గా ఈ సినిమాలో రజనీ కనిపించనున్నారనే విషయం అర్థమవుతోంది. ఆయన లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

రజనీ సరసన నాయికగా నయనతార నటించిన ఈ సినిమాలో, ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక జాకీ ష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రల్లో మెప్పించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు.