Andhra Pradesh: కనిగిరిలో ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

Mentally Retarded Person Set The Bus In Ablaze
  • వెంటనే మంటలార్పిన స్థానికులు
  • సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
  • నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తింపు
ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు యువకుడు నిప్పంటించిన ఘటన ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఇవాళ ఉదయం జరిగింది. వెలిగండ్ల మండలం మొగులూరుకు చెందిన రామగిరి ఏడుకొండలు అనే యువకుడు.. ఆగి ఉన్న బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

స్థానికులు వెంటనే గమనించి మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకూ ఎలాంటి నష్టం జరగలేదు. స్థానికులు నిందితుడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. పూజలు చేస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయంటూ వింత వ్యాఖ్యలు చేశాడని చెబుతున్నారు. యువకుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు గుర్తించారు.
Andhra Pradesh
Crime News
Bus
RTC

More Telugu News