Pragya Thakur: అమ్మాయిలతో కలిసి 'క‌బ‌డ్డీ' ఆడిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌.. వైర‌ల్ అవుతోన్న వీడియో

Pragya  Thakur plays kabaddi
  • భోపాల్‌లోని కాళీమాత‌ దేవాలయం వ‌ద్ద ఆట‌
  • కబడ్డీ ఆడాల‌ని అక్క‌డి వారు కోరడంతో ఆడిన ఎంపీ
  • ఎద్దేవా చేసిన‌ కాంగ్రెస్ నేత బీవీ శ్రీ‌నివాస్
  • ఎన్ఐఏ తదుప‌రి విచార‌ణ ఎప్పుడ‌ని వ్యాఖ్య‌
వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్‌ కబడ్డీ ఆడారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్‌లోని కాళీమాత‌ దేవాలయం వ‌ద్ద ఆమె ఆ ఆట ఆడారు. ద‌స‌రా సంద‌ర్భంగా మొద‌ట గుడిలో పూజల్లో పాల్గొన్న ప్ర‌జ్ఞా ఠాకూర్‌ అనంత‌రం గుడి వ‌ద్ద మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వ‌హిస్తుండడాన్ని చూశారు. ప్ర‌జ్ఞాను కూడా ఆడాల‌ని అమ్మాయిలూ కోరారు.

దీంతో ఆమె క‌బ‌డ్డీ.. క‌బ‌డ్డీ అంటూ కూత పెడుతూ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మాలెగావ్ కేసులో ఆమె ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌పై బయటకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఆమె క‌బ‌డ్డీ ఆడిన వీడియోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత బీవీ శ్రీ‌నివాస్ ఆమెను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముందు ఆమె విచార‌ణ‌కు మ‌ళ్లీ ఎప్పుడు హాజ‌రు కావాల్సి ఉందని ప్ర‌శ్నించారు.
Pragya Thakur
BJP
kabaddi
Viral Videos

More Telugu News