టీఆర్ఎస్ అధ్య‌క్షుడి ఎన్నిక ప్ర‌క్రియ‌కు తేదీలు ప్ర‌క‌టించిన కేటీఆర్

13-10-2021 Wed 13:28
  • ఈ నెల 17 నుంచి 22 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ
  • 23న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌
  • 24న ఉపసంహ‌ర‌ణ ప్ర‌క్రియ‌
  • 25న టీఆర్ఎస్ అధ్య‌క్షుడి ఎన్నిక‌
ktr announces dates for trs president elections

టీఆర్ఎస్ అధ్య‌క్షుడి ఎన్నిక ప్ర‌క్రియ‌కు ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ తేదీలు ప్ర‌క‌టించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 17 నుంచి 22 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ, 23న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, 24న ఉపసంహ‌ర‌ణ వుంటాయని, 25న టీఆర్ఎస్ అధ్య‌క్షుడిని ఎన్నుకుంటార‌ని తెలియజేశారు.

తెలంగాణ ప్ర‌త్యేక‌ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీ ఏర్పాటు అయింద‌ని ఆయన తెలిపారు. అనేక సవాళ్లను ఎదుర్కొని ఇక్క‌డ‌ ప్రజల కలలను సాకారం చేసింద‌ని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌ అద్భుతమైన విధానాలతో పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15న వరంగల్‌లో నిర్వహిస్తున్నామని వివ‌రించారు.  

తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాల‌ని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. అలాగే, తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27న‌ నిర్వహిస్తామ‌న్నారు.