Kakinada: కాకినాడ మేయర్ పదవి నుంచి పావనిని తొలగించిన ఏపీ ప్రభుత్వం.. కోర్టు ధిక్కరణ అన్న పావని

AP govt releases GO on Kakinada mayor
  • ఇటీవల పావనిపై అవిశ్వాస తీర్మానం
  • కోర్టును ఆశ్రయించిన పావని
  • 22 వరకు ఫలితాలను ప్రకటించవద్దన్న హైకోర్టు

కాకినాడ మేయర్ సుంకర పావని (టీడీపీ)పై ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పావని తన మేయర్ పదవిని కోల్పోయారు. ఈ క్రమంలో ఆమె కోర్టుకు వెళ్లారు. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఫలితాలను ఈనెల 22 వరకు ప్రకటించవద్దని ఆదేశించింది.

మరోపక్క, పావనిని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై పావని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తనను పదవి నుంచి తొలగించడం కోర్టు ధిక్కారణ అవుతుందని చెప్పారు. గెజిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తనను తొలగించినప్పటికీ... తాను మేయర్ హోదాలోనే కొనసాగుతానని తెలిపారు.

  • Loading...

More Telugu News