Manchu Vishnu: 'మా' అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన మంచు విష్ణు.. తొలి సంతకం ఏ ఫైల్ పై పెట్టారంటే..!

Manchu Vishnu assumed the office of the president of MAA
  • పెన్షన్ల ఫైల్ పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు
  • అందరి మద్దతు తనకు కావాలని కోరిన విష్ణు
  • రాజీనామాలపై విష్ణు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారిన వైనం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్ష హోదాలో ఆయన తొలి సంతకాన్ని పెన్షన్ల ఫైల్ పై చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు అందరి మద్దతు తనకు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

మరోవైపు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన వారందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాల అంశంపై ప్రెసిడెంట్ హోదాలో మంచు విష్ణు ఎలా వ్యవహరిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులను కలుపుకుని పోతారా? లేకపోతే బైలాస్ ప్రకారం కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాలి. మరోవైపు ఇతర పదవులకు ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం ఎప్పుడనే విషయం తెలియాల్సి ఉంది.
Manchu Vishnu
Tollywood
MAA
President

More Telugu News