Uttar Pradesh: భూములకు పరిహారం పెంచాలంటూ ఆందోళన చేస్తున్న 1500 మంది రైతులపై హత్యాయత్నం కేసులు!

UP Police files attempt to murder cases over 1500 farmers
  • ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సరిపోవట్లేదని ఆందోళన
  • పరిహారం పెంచి ఇవ్వాలని 40 రోజులుగా డిమాండ్
  • హత్యాయత్నం సహా పలు అభియోగాల కింద కేసుల నమోదు
తమ నుంచి సేకరిస్తున్న భూములకు నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలంటూ నోయిడాలో  ఆందోళన చేస్తున్న రైతులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హత్యాయత్నం కేసులు నమోదు చేసింది. తమ నుంచి సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, మరికొంత పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 40 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న దాదాపు 1500 మంది రైతులపై పలు అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. రైతులపై నమోదైన అభియోగాల్లో హత్యాయత్నం, అల్లర్లు రేపడం, అక్రమ నిర్బంధం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి ఉన్నాయి.

 ఈ కేసులపై అధికారులు మాట్లాడుతూ.. నోయిడా అథారిటీ కార్యాలయం ప్రధాన ద్వారానికి భారతీయ కిసాన్ పరిషత్ నేత సుఖ్‌వీర్ ఖలీఫా, మరికొందరు నేతలు తాళం వేశారని, ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. సుఖ్‌బీర్ సహా మొత్తం 31 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసినట్టు తెలిపారు.
Uttar Pradesh
Noida
Farmers
Police Cases

More Telugu News