'పుష్ప' నుంచి 'శ్రీ‌వ‌ల్లి' పాట ప్రోమో విడుద‌ల‌.. అల‌రిస్తోన్న చంద్ర‌బోస్ లిరిక్స్‌

12-10-2021 Tue 14:04
  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘పుష్ప‌’
  • శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక
  • చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి..
  • మాటే మాణిక్యమాయేనే..
  • న‌వ్వే న‌‌వర‌త్న‌మాయెనే అంటూ పాట
srivalli pomo song releases

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పుష్ప‌’ సినిమా నుంచి శ్రీ‌వ‌ల్లి పాట ప్రోమోను ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుద‌ల చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్నా శ్రీ‌వ‌ల్లిగా నటిస్తోన్న విష‌యం తెలిసిందే. 'చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే.. చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. న‌వ్వే న‌వ‌ర‌త్న‌మాయెనే' అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అల‌రిస్తున్నాయి.

ఈ సినిమా కోసం చంద్ర‌బోస్ రాసిన 'దాక్కో దాక్కో మేక' పాట‌కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 'శ్రీ‌వ‌ల్లి' పాటని అక్టోబర్‌ 13న ఉదయం 11.07కు విడుదల చేయ‌నున్నారు. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేశ్, అజయ్ ఘోష్, అనసూయ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానున్న‌ట్లు ఆ సినిమా యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.