Raj Kumar Yadav: నా గత జన్మలో అసదుద్దీన్ ఒవైసీ నకులుడు, మోహన్ భగవత్ శకుని: కలకలం రేపిన మధ్యప్రదేశ్ సబ్ ఇంజినీర్ లేఖ

Madhya Pradesh sub engineer says about reincornation
  • ప్రతి ఆదివారం సెలవు కావాలంటున్న సబ్ ఇంజినీర్
  • తన గత జన్మ రహస్యం తెలిసిందంటూ లేఖ
  • శాశ్వత ఆత్మ గురించి శోధించాలని వెల్లడి
  • నకులుడు తనకు మంచి మిత్రుడు అంటూ వ్యాఖ్యలు
తనకు గత జన్మ గుర్తొచ్చిందంటూ మధ్యప్రదేశ్ లోని ఓ సబ్ ఇంజినీర్ తీవ్ర కలకలం రేపాడు. ఆయన పేరు రాజ్ కుమార్ యాదవ్. అగర్ మాల్వా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆయన ఉన్నతాధికారులకు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. కొన్ని రోజుల కిందట తనకు గత జన్మ గురించి తెలిసిందని, తాను మహాభారత కాలం నాటివాడినని పేర్కొన్నాడు. ప్రతి ఆదివారం తనకు సెలవు ఇస్తే శాశ్వత ఆత్మ గురించి శోధిస్తానని, జీవిత రహస్యం తెలుసుకుంటానని ఆ లేఖలో కోరాడు.

అంతేకాదు, తన గత జన్మలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నకులుడు అని, ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శకుని అని వివరించాడు. పాండవుల్లో ఒకడైన నకులుడు తనకు మంచి మిత్రుడని తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వింత లేఖ వైరల్ అవుతోంది.
Raj Kumar Yadav
Reincornation
Sub Engineer
Madhya Pradesh

More Telugu News