Budwel: బద్వేలు ఉప ఎన్నిక: 9 నామినేషన్ల ఉపసంహరణ... బరిలో 18 మంది అభ్యర్థులు

  • ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక
  • నేడు నామినేషన్ల స్క్రూటినీ
  • అనర్హులను గుర్తించిన అధికారులు
  • ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
Nine nominations rejected in Budwel by elections

ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. నేడు నామినేషన్లు పరిశీలించారు. బద్వేలు ఉప ఎన్నిక కోసం 27 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, నేటి పరిశీలనలో 9 మంది అనర్హులుగా తేలారు. వారి నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం బద్వేలు బరిలో 18 మంది మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13 వరకు గడువు ఉంది.

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆనవాయితీ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. దీంతో టీడీపీ, జనసేన పోటీ చేయరాదని నిర్ణయించుకోగా, బీజేపీ పనతల సురేశ్ ను తమ అభ్యర్థిగా బరిలో దించింది.

More Telugu News