ఏపీలో గత 24 గంటల్లో 310 కరోనా కేసుల వెల్లడి

Corona details of Andhra Pradesh
  • ఏపీలో బాగా తగ్గుముఖం పట్టిన కరోనా
  • గత 24 గంటల్లో 23,022 కరోనా పరీక్షలు
  • గుంటూరు జిల్లాలో 54 కేసులు
  • అనంతపురం జిల్లాలో ఇద్దరికి పాజిటివ్
  • ఇంకా 7,258 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 23,022 కరోనా పరీక్షలు నిర్వహించగా, 310 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 54 కొత్త కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 51, చిత్తూరు జిల్లాలో 45, తూర్పు గోదావరి జిల్లాలో 38 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 994 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,57,562 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,36,048 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,258 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 14,256కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Deaths
Today Cases
Andhra Pradesh

More Telugu News