మా ఎన్నికలు: బోణీ కొట్టిన విష్ణు ప్యానెల్ అభ్యర్థులు... ఎనిమిది మంది విజయం

  • కొనసాగుతున్న కౌంటింగ్
  • ఈసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తి
  • ఆఫీస్ బేరర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు షురూ
  • ఫలితాలపై ఉత్కంఠ
Eight members from Vishnu panel registered wins

'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తొలి ఫలితం అందుకోగా, మంచు విష్ణు ప్యానెల్ కూడా బోణీ కొట్టింది. విష్ణు ప్యానెల్ నుంచి ఎనిమిది మంది విజయం సాధించారు. మాణిక్, బొప్పన శివ, జయవాణి, హరినాథ్, శ్రీలక్ష్మి, పసునూరి శ్రీనివాస్, పూజిత, శశాంక్ గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి శివారెడ్డి, కౌశిక్, అనసూయ, సురేశ్ కొండేటి విజయం సాధించారు. ప్రస్తుతం ఈసీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తయినట్టు తెలుస్తోంది. అనంతరం ఆఫీస్ బేరర్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు.

More Telugu News