ఐపీఎల్ క్వాలిఫయర్-1: ఢిల్లీపై టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

Chennai Super Kings won the toss against Delhi Capitals in IPL Qualifier one
ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ దశకు తెరలేచింది. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్-1 పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలకమైన మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ ధోనీ వెల్లడించాడు.

ఇక ఢిల్లీ జట్టులో ఒక మార్పు జరిగింది. రిపల్ పటేల్ స్థానంలో ఆల్ రౌండర్ టామ్ కరన్ జట్టులోకి వచ్చాడని ఆ జట్టు సారథి రిషబ్ పంత్ వెల్లడించాడు. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు.

కాగా, ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్ లో తలపడుతుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్స్ కు వెళుతుంది.
Go Back to Shorts
Chennai Super Kings
Toss
Delhi Capitals
Qualifier-1
IPL

More Telugu News