MAA: 'మా' ఎన్నికల్లో తొలి ఫలితం... ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ఇద్దరి గెలుపు

MAA Elections results
  • కొనసాగుతున్న 'మా' ఓట్ల కౌంటింగ్
  • శివారెడ్డి, కౌశిక్ విజయం
  • ఇరువురు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ వర్గీయులే!
  • అనసూయ, సురేశ్ కొండేటి ముందంజ
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న'మా' ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో ఇద్దరు గెలుపొందారు. 'మా కార్యకర్గ సభ్యులుగా పోటీపడిన శివారెడ్డి, కౌశిక్ లు విజేతలుగా నిలిచారు. ఈ ఫలితంతో ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అంతేకాదు, వారి సంతోషం ఇనుమడింపజేసేలా అనసూయ, సురేశ్ కొండేటి ఓట్ల లెక్కింపులో ముందంజలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారే.
MAA
Results
Counting
Elections
Tollywood

More Telugu News