'మా' ఎన్నికల్లో ఓటు వేయని నటులు వీరే!

10-10-2021 Sun 17:24
  • ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్
  • కొనసాగుతున్న కౌంటింగ్
  • ఈసారి భారీగా ఓట్లు
  • ఓటింగ్ దూరంగా ఉన్న అగ్రతారలు
Stars who do not cast their votes in MAA elections
'మా' ఎన్నికల్లో ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. 'మా'లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా, వారిలో ఓటు హక్కు ఉన్నది 883 మందికి. నేడు జరిగిన పోలింగ్ లో పోస్టల్ బ్యాలెట్లతో సహా 665 ఓట్లు పోలయ్యాయి. అయితే, పలువురు నటీనటులు 'మా' ఎన్నికల్లో ఓటు వేయని విషయం వెల్లడైంది. వారిలో మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి అగ్రహీరోలు ఉన్నారు.

రవితేజ, అనుష్క, హన్సిక, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్, సత్యదేవ్, అల్లు శిరీష్, శర్వానంద్, నాగచైతన్య, రానా, సుశాంత్, సునీల్, సుమంత్, నిహారిక, త్రిష తదితరులు ఓటు హక్కు వినియోగించుకోలేదని సమాచారం. షూటింగులు, ఇతర కారణాలతో వారు ఓటింగ్ కు రాలేకపోయినట్టు తెలుస్తోంది.

కాగా, నేడు ఓటేసిన వారిలో సీనియర్ నటి జయప్రద కూడా ఉన్నారు. రోజా, జెనీలియా తదితరులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.