'బ్ర‌హ్మానందం లోప‌లికి వ‌చ్చి రిగ్గింగ్ చేస్తున్నారు'.. అంటూ జోకులు పేల్చిన హీరో మంచు విష్ణు.. వీడియో ఇదిగో

10-10-2021 Sun 13:38
  • 'మా' ఎన్నిక‌ల వేళ మీడియాతో మాట్లాడిన విష్ణు
  • గొడ‌వ‌లు జ‌ర‌గ‌ట్లేదని చెప్పే ప్ర‌య‌త్నం
  • 'నాన్న గారు.. బ్ర‌హ్మానందం గారు క‌లిసి గ‌తంలోనూ డ్రామా ఆడారు' అని వ్యాఖ్య‌
manchu vishnu jokes about brahmanandam

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకుంటోన్న ప‌రిణామాల‌పై హీరో మంచు విష్ణు జోకులు వేశాడు. గొడ‌వ‌లు జ‌ర‌గ‌ట్లేదని అంద‌రూ స‌ర‌దాగా అలా గొడ‌వ‌ప‌డుతున్న‌ట్లు న‌టిస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు.

'నాన్న గారు.. బ్ర‌హ్మానందం గారు క‌లిసి గ‌తంలో ఎలా స‌ర‌దాగా డ్రామా ఆడారో అంద‌రికీ తెలుసు. అంతేగానీ, ఏమీ లేదు. బ్ర‌హ్మానందంగారు లోప‌లికి వ‌చ్చి రిగ్గింగ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా చెబుతున్నాను..' అని విష్ణు జోకులు పేల్చాడు. అనంత‌రం ప్ర‌కాశ్ రాజ్‌తో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడుతూ గొడ‌వ‌లు జ‌ర‌గట్లేదని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.