Jammu And Kashmir: కశ్మీర్ లో పౌరుల వరుస హత్యలు.. 570 మంది ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేసిన బలగాలు

570 members Have detained Following Targeted Civilian Killings
  • ఇటీవలి కాలంలో బాగా పెరిగిన ఉగ్రదాడులు
  • ఉగ్రవాదుల ఏరివేతను దగ్గరుండి చూడనున్న ఐబీ ఉన్నతాధికారి
  • వారంలో ఆరుగురిని చంపేసిన ఉగ్రమూకలు
జమ్మూకశ్మీర్ లో సంఘ విద్రోహ శక్తులపై బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవలి కాలంలో సామాన్యులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసి చంపేస్తుండడంతో సైన్యం అప్రమత్తమైంది. ఇవాళ ఉగ్రవాదులకు, ఉగ్రవాద కార్యకలాపాల సానుభూతిపరులైన 70 మంది యువకులను అరెస్ట్ చేసింది. దీంతో కశ్మీర్ వ్యాప్తంగా మొత్తం అరెస్టుల సంఖ్య 570కి చేరింది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ను దగ్గరుండి చూసుకునేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉన్నతాధికారిని కేంద్ర ప్రభుత్వం శ్రీనగర్ కు పంపించింది.

కాగా, జమ్మూకశ్మీర్ లోని 15 కీలక ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు దాడులు చేశారు. గత ఐదు రోజుల్లో ఆరుగురు పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్, స్కూల్ టీచర్ ను చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. మఖన్ లాల్ బింద్రూ అనే ప్రముఖ కశ్మీరీ పండిట్, ఫార్మాసిస్ట్ నూ పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసి హత్య చేశారు. మంగళవారం శ్రీనగర్ లో బీహార్ కు చెందిన వీరేంద్ర పాశ్వాన్ అనే చాట్ వ్యాపారి, బందీపొరాకు చెందిన మహ్మద్ షఫీ లోనేను ఉగ్రవాదులు చంపేశారు.
Jammu And Kashmir
Terrorists
NIA
Intelligence Bureau

More Telugu News