నేను 300 మందిని విందుకు పిలిస్తే 500 మంది వచ్చి మద్దతు ఇచ్చారు: మంచు విష్ణు

09-10-2021 Sat 20:02
  • ఆదివారం మా ఎన్నికలు
  • చురుగ్గా పోలింగ్ ఏర్పాట్లు
  • పరిశీలించిన మంచు విష్ణు
  • మా సభ్యులందరూ తనవైపే ఉన్నారని ధీమా
Manchu Vishnu comments on MAA elections

రేపు (అక్టోబరు 10) మా ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఓటింగ్ కు వేదికగా నిలుస్తున్న హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలును మంచు విష్ణు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తాము రాత్రి ఇచ్చిన విందుకు 500 మందికిపై మా సభ్యులు హాజరయ్యారని వివరించారు. తాను 300 మందిని ఆహ్వానిస్తే, 500 మంది వచ్చి మద్దతు ఇచ్చారని వెల్లడించారు.

దీన్నిబట్టే మా సభ్యులు అందరూ తనవైపే ఉన్న విషయం స్పష్టమవుతోందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు రేపు విమానాల్లో వచ్చి ఓటేస్తారని మంచు విష్ణు వెల్లడించారు. ఇక, నాగబాబు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.