ఏపీలో కరోనా వ్యాప్తి వివరాలు ఇవిగో!

09-10-2021 Sat 18:57
  • గత 24 గంటల్లో 45,818 కరోనా పరీక్షలు
  • 629 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 104 కొత్త కేసులు
  • విజయనగరం జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
  • రాష్ట్రంలో 8 మంది మృతి
  • ఇంకా 8,134 మందికి చికిత్స
AP Corona media report
ఏపీలో గడచిన 24 గంటల్లో 45,818 కరోనా పరీక్షలు నిర్వహించగా, 629 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 104 కేసులు వెల్లడి కాగా, మిగతా అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో 91, కృష్ణా జిల్లాలో 75, నెల్లూరు జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 797 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా 20,56,628 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,34,244 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,134 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,250కి పెరిగింది.