Prakash Raj: పోస్టల్ బ్యాలెట్ పై తప్పు జరిగిపోయింది... దేశంలో న్యాయం లేకుండా పోయింది: ప్రకాశ్ రాజ్ ఆవేదన

Prakash Raj prepares for MAA election polling
  • మరికొన్ని గంటల్లో మా ఎన్నికల పోలింగ్
  • జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటింగ్ కు ఏర్పాట్లు
  • పరిశీలించిన ప్రకాశ్ రాజ్
  • మంచి వాళ్లు పోటీ చేయలేకపోతున్నారని ఆక్రోశం
మా ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలుంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రేపు (అక్టోబరు 10) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.

ఈ నేపథ్యంలో, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, పోస్టల్ బ్యాలెట్ అంశంలో తప్పు జరిగిపోయిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల అధికారి కూడా తప్పుగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలో న్యాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచివాళ్లు పోటీ చేయలేకపోతున్నారని ఆక్రోశించారు. రేపటి పోలింగ్ గురించి చెబుతూ, ఈసారి ఎక్కువ ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో మా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న జీవిత మాట్లాడుతూ, ఎవరికి ఓటు వేయాలన్నదానిపై మా సభ్యుల్లో స్పష్టత ఉందని పేర్కొన్నారు. నాగబాబు చెప్పిన అన్ని విషయాలు వాస్తవమేనని అన్నారు. రాజకీయాలు అన్నీ ఒకేలా ఉంటాయని జీవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రాల రాజకీయాలు, మా రాజకీయాలకు తేడా కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు.
Prakash Raj
MAA Elections
Polling
Tollywood

More Telugu News