రానా చేతుల మీదుగా 'మాయోన్' టీజర్!

09-10-2021 Sat 11:57
  • శిబి సత్యరాజ్ హీరోగా 'మాయోన్'
  • ప్రాచీన దేవాలయంలో నిధి
  • నిధి చుట్టూ తిరిగే కథ
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
Maayon movie telugu teaser released

తమిళంలో హీరోగా శిబి సత్యరాజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా ఆయన సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 'మాయోన్' సినిమాతో తన కోరిక నెరవేరుతుందనే గట్టి నమ్మకంతో ఆయన ఉన్నాడు. కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సిబి సత్యరాజ్ జోడీగా తాన్య రవిచంద్రన్ కనువిందు చేయనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి రానా చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనీ, సినిమాను ఎప్పుడు చూస్తానా అనే ఆత్రుత కలుగుతోందని రానా అన్నాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ, ఈ సినిమా టీమ్ కి ఆయన శుభాకాంక్షలు తెలియజేశాడు.

చూస్తుంటే ఇది ఒక ప్రాచీన దేవాలయం .. అందులో భద్రపరచబడిన నిధి .. ఆ నిధి కోసం కొంతమంది చేసే ప్రయత్నం చుట్టూ అల్లుకోబడిన కథలా అనిపిస్తోంది. ఆ నిధి భద్రపరచబడిన వివరాలను తెలిపే వాయిస్ ఓవర్ పై టీజర్ మొదలైంది. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కేఎస్ రవికుమార్ .. రాధారవి .. భగవతి పెరుమాళ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.