హుజూరాబాద్ ఎన్నికల ఎఫెక్ట్.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో స్వల్ప మార్పులు
Add ap7am to your home Screen

హుజూరాబాద్ ఎన్నికల ఎఫెక్ట్.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో స్వల్ప మార్పులు

Telangana Inter Board Changes Inter 1st Exams dates amid Huzurabad by poll
  • ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్
  • 29న జరగాల్సిన పరీక్షలను 31కి, 30న జరగాల్సిన పరీక్షలను నవంబరు 1వ తేదీకి వాయిదా
  • విద్యార్థులు గమనించాలన్న ఇంటర్‌బోర్డు
ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో తెలంగాణ ఇంటర్‌బోర్డు స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇది వరకే బోర్డు ప్రకటించింది. అయితే, ఆ తర్వాత హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కొన్ని పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.

ఈ నెల 29న భౌతికశాస్త్రం, ఆర్థిక శాస్త్రం పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని ఈ నెల 31న ఆదివారం, 30న జరగాల్సిన రసాయనశాస్త్రం, కామర్స్ పరీక్షలను నవంబరు 1న జరుపుతామని బోర్డు ప్రకటించింది. నవంబరు 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు గణితం, 3న జాగ్రఫీ, మోడర్న్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
Inter Board
Telangana
Exams
Huzurabad

More Telugu News