భారీ వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్.. మరోసారి వర్షసూచన
- హైదరాబాదులో మళ్లీ వాన
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- చెరువుల్లా మారిన రోడ్లు
- వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
- అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
సుమారు రెండుగంటల పాటు ఏకబిగిన పడిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాసేపటికే రోడ్లు చెరువుల్లా మారాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. భారీ వర్షంతో వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ సహాయ కార్యక్రమాలు, ఇతర సమాచారం కోసం 040 21111111 ఫోన్ నెంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కాగా, మరో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.