సన్ రైజర్స్ బౌలింగ్ ను చీల్చిచెండాడిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్... ముంబయి 20 ఓవర్లలో 235-9

08-10-2021 Fri 21:45
  • అబుదాబిలో ముంబయి వర్సెస్ హైదరాబాద్
  • భారీ స్కోరు సాధించిన ముంబయి
  • ఇషాన్ కిషన్, సూర్యకుమార్ అర్ధసెంచరీలు
  • ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన వైనం
Ishan Kishan and Suryakumar smashes Sunrisers bowling

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆశలు ఏమూలో మిణుకుమిణుకు మంటున్న దశలో భారీ విజయంపై కన్నేసిన ముంబయి ఇండియన్స్... సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో 20 ఓవర్లలో 9 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ సన్ రైజర్స్ బౌలింగ్ ను తుత్తునియలు చేశారు. వీరిద్దరి జోరుకు అబుదాబిలోని షేక్ జాయేద్ మైదానం ఊగిపోయింది.

ఇషాన్ కిషన్ 32 బంతులలో 84 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరు మినహా ముంబయి జట్టులో మరెవ్వరూ రాణించకపోయినా ఆ జట్టు స్కోరు 200 దాటింది. సన్ రైజర్స్ బౌలింగ్ లో జాసన్ హోల్డర్ 4 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ 2, అభిషేక్ శర్మ 2, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు.

ఇక, దుబాయ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా (48), శిఖర్ ధావన్ (43) తొలి వికెట్ కు 88 పరుగులు జోడించి శుభారంభం అందించారు. మిడిలార్డర్ లో హెట్మెయర్ 29 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. చహల్, హర్షల్ పటేల్, డాన్ క్రిస్టియన్ తలో వికెట్ పడగొట్టారు.