CM Jagan: రెండ్రోజుల పాటు తిరుపతి, తిరుమలలో సీఎం జగన్ పర్యటన

CM Jagan will tour in Tirupati and Tirumala
  • ఈ నెల 11, 12 తేదీల్లో సీఎం జగన్ పర్యటన
  • తిరుపతిలో పలు కార్యక్రమాలకు హాజరు
  • తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు
  • స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
  • టీటీడీ అధికారులతో సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన పర్యటన సాగనుంది. తొలుత తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో చిన్న పిల్లల గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రారంభించనున్నారు. ఆపై తిరుపతిలోని అలిపిరి వద్ద గో మంటపాన్ని ప్రారంభిస్తారు.

తదుపరి, తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, 12వ తేదీ ఉదయం దైవదర్శనం చేసుకోనున్నారు. ఈ క్రమంలో ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించడంతో పాటు, లడ్డూ తయారీ భవనాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
CM Jagan
Tirupati
Tirumala
Andhra Pradesh

More Telugu News