మంచు విష్ణుకు మద్దతు ప్రకటించిన కోట శ్రీనివాసరావు... ప్రకాశ్ రాజ్ పై విమర్శలు

  • అక్టోబరు 10న మా ఎన్నికలు
  • కోటను కలిసిన మోహన్ బాబు తదితరులు
  • మంచు విష్ణుకు ఓటేస్తానని కోట వెల్లడి
  • గొప్పలు చెప్పుకోనంటూ ప్రకాశ్ రాజ్ కు చురకలు
Kota Srinivasa Rao extends his support for Manchu Vishnu panel in MAA elections

మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మద్దతు సంపాదించింది. మంచు విష్ణు ప్యానెల్ గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కలిసిన మోహన్ బాబు తదితరులను ఉద్దేశించి మాట్లాడుతూ, 'అయినా మంచు విష్ణుకు ఓటేయాలని మీరు అడగడం ఏంటండీ, మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి అర్హుడు' అని ఉద్ఘాటించారు. 'మా అబ్బాయి ఎన్నికల్లో నిల్చుంటున్నాడు... ఓటేయండి అని మీరు అడగాల్సి అవసరం లేదండీ... మేం విష్ణుకే ఓటేస్తున్నాం' అని స్పష్టం చేశారు.

ప్రకాశ్ రాజ్ అనే వ్యక్తి గురించి స్పందించాల్సి వస్తే నటుడిగా అతడి గురించి తానేమీ మాట్లాడబోనని అన్నారు. తాను అతడితో 15 సినిమాల వరకు చేశానని, అయితే, అతడికి క్రమశిక్షణ లేదని విమర్శించారు. ఏనాడూ షూటింగ్ కు టైముకు వచ్చేవాడు కాదని కోట ఆరోపించారు. 'నేను నేషనల్ లెవల్ ఆర్టిస్టుని, నాకు ఇన్ని నందులు వచ్చాయి, అవి వచ్చాయి ఇవి వచ్చాయి అని నేనెప్పుడూ చెప్పుకోను' అంటూ ప్రకాశ్ రాజ్ కు చురకలు అంటించారు.

More Telugu News