తెలంగాణలో మరో 201 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 47,465 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 64 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,345 మందికి చికిత్స
అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,67,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,263 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,345 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,927కి పెరిగింది.
