గవర్నర్ తమిళిసైతో కలిసి బతుకమ్మ ఆడిన కవిత.. వీడియో ఇదిగో

08-10-2021 Fri 13:36
  • తెలుగు యూనివర్సిటీలో  బతుకమ్మ సంబురాలు
  • వ‌ర్సిటీ ఉద్యోగులు,  విద్యార్థినుల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ
  • ప్ర‌జ‌ల‌కు పండుగ శుభాకాంక్ష‌లు
tamilisai participates in bathukamma festival

తెలంగాణ  గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ తో క‌లిసి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత బ‌తుకమ్మ ఆడారు. తెలుగు యూనివర్సిటీలో నిర్వ‌హించిన‌ బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న వారిద్ద‌రూ వ‌ర్సిటీ ఉద్యోగులు, విద్యార్థినుల‌తో క‌లిసి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. విద్యార్థినులకు త‌మిళిసై పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.  

గవర్నర్ తమిళిసైతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని క‌విత అన్నారు. పాత పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేయాల‌ని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో కాలంతో పాటు ప్ర‌జ‌లు మ‌ర్చిపోయిన‌ తెలుగు పదాలు, తెలంగాణ పదాలు మళ్లీ భాషలో చేరే అవకాశం ఉంటుంద‌ని చెప్పారు.