Allu Arjun: భూమి రిజిస్ట్రేష‌న్ కోసం శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాల‌యానికి అల్లు అర్జున్.. ఫొటోలు ఇవిగో!

Allu Arjun registered 2 acres of Janavada village land at Shankarpalli Tahasildar office
  • చేవేళ్లలోని జన్వాడ గ్రామంలో 2 ఎకరాల భూమి కొనుగోలు
  • బ‌న్నీతో త‌హ‌సీల్దార్ కార్యాల‌య సిబ్బంది  ఫొటోలు
  • అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా వ‌చ్చిన స్థానికులు
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఇటీవ‌ల కొనుగోలు చేసిన రెండు ఎకరాల వ్యవసాయ భూమికి సినీ హీరో అల్లు అర్జున్ రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాల‌యానికి వెళ్లి సంత‌కాలు చేశాడు.

ఆ స‌మ‌యంలో ఆ కార్యాల‌య సిబ్బంది ఆయనతో దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అంతేగాక‌, త‌మ ప్రాంతానికి అల్లు అర్జున్ వ‌చ్చాడ‌ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. ఆయ‌న‌తో ఫొటోలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. రిజిస్ట్రేషన్ ప‌నులు పూర్త‌యిన‌ వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్ వ‌చ్చాడు.
                
Allu Arjun
Tollywood
Ranga Reddy District

More Telugu News