Samantha: సమంత చేతిలో మూడు సినిమాలు .. ఒకే రోజున ప్రకటన?

Samantha upcoming movies
  • సమంత నుంచి రానున్న 'శాకుంతలం'
  • గుణశేఖర్ తీర్చిదిద్దుతున్న దృశ్యకావ్యం
  • కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో సమంత
  • పని దిశగా మనసు మళ్లించే ప్రయత్నం  
సమంత నుంచి రానున్న తాజా చిత్రంగా 'శాకుంతలం' మాత్రమే కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గ్రాఫిక్స్ పరమైన పనులను జరుపుకుంటోంది. శకుంతల చరిత్రగా నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత సమంత ఏ ప్రాజెక్టులను లైన్లో పెట్టిందనే విషయం ఎక్కడా చెప్పలేదు. ఈ లోగా విడాకులకు సంబంధించిన గొడవలే సరిపోయాయి. అయితే ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ తాజాగా వినిపిస్తోంది. అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంలో క్లారిటీ లేదు.

కానీ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటన ఒకే రోజున వచ్చేలా సమంత ప్లాన్ చేస్తోందని అంటున్నారు. వారం రోజుల్లో ఆమె ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ సినిమాలు మొదలైతే, మనసును ఆ వైపు మళ్లించవచ్చని ఆమె భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Samantha
Gunasekhar
Shakunthalam

More Telugu News