South Central Railway: దసరాకు ఏపీ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లు

  • ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
  • ఈ నెల 14 నుంచి ప్రత్యేక రైళ్లు మొదలు
  • 17న కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్‌కు చివరి రైలు
South Central Railway announce 4 special trains to dasara passengers

దసరా పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఇందులో సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ (07456), నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ (07455), సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (07053), కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (07054) ఉన్నాయి.

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. అలాగే, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ రైలు 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

More Telugu News